రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనావస్థకు చేరుకుంది: కేపీ వివేకానంద

  • నగరానికి కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదన్న కేపీ వివేకానంద 
  • భారీ వర్షాలు కురుస్తున్నా జీహెచ్ఎంసీ నిద్రావస్థలో ఉందని ఆరోపణ
  • కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్న ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనావస్థకు చేరుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నగరానికి కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నా జీహెచ్ఎంసీ నిద్రావస్థలో ఉందని ఆరోపించారు.

గతంలో చాలా కాలనీలను వరద ముంపు నుంచి తాము కాపాడామన్నారు. కానీ ప్రస్తుతం 17 ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయన్నారు. కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇకనైనా పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే నాలాలు ఉప్పొంగి నీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం జరిగే అవకాశముందన్నారు.

నగరంలో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య లేదని, ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 36 ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. మంత్రులు నగరంలో తిరిగితే గానీ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో కనిపించదన్నారు.


More Telugu News