కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణంలో కీలక పరిణామం
- రూ.1400 కోట్ల స్కాంపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం
- ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
- మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై విచారణ
కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల ఈ స్కాంపై అసెంబ్లీలో చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కాంకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై విచారణ సాగుతోంది. సీసీఎస్ పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితులు 75 మంది లేదా కంపెనీల పన్ను చెల్లింపుదారుల వివరాలను ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేశారు. వీరు పన్ను ఎగవేయడానికి నిందితులు సహకరించినట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీసీఎస్ పోలీసులు మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు.