గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు... కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్ వంటి నగరాలకు విమానాలు
- ఇండిగో సర్వే చేసిన రూట్లలో విమానాలు నడపాలన్న విజయవాడ ఎంపీ చిన్ని
- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి
ఏపీలోని గన్నవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపాలన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు.
గన్నవరం నుంచి వారణాసి, అహ్మదాబాద్, పూణే, కోల్ కతా, బెంగళూరు వంటి నగరాలకు విమానాలు నడపాలని కేశినేని చిన్ని కోరారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్... విజయవాడ నుంచి కోల్ కతా వయా విశాఖపట్నం... విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి... విజయవాడ నుంచి అహ్మదాబాద్... విజయవాడ నుండి పూణేలకు విమాన సర్వీసుల ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఇండిగో సర్వే చేసిన ఈ మార్గాల్లో వెంటనే విమానాలు నడపాలని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందించారు. ఈ వినతిపత్రాన్ని తప్పకుండా పరిశీలించి చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని కేశినేని చిన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.