అమెరికాలో హైదరాబాదీ యువకుడి దుర్మరణం!
- షికాగోలో గత శనివారం దుర్ఘటన
- స్నేహితులతో కలిసి లేక్ మిషిగన్‌లో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం
- అలసిపోయి ఈత కొట్టలేక మధ్యలోనే నీట మునిగిన యువకుడు
- ఆదివారం స్వగ్రామంలో యువకుడి అంత్యక్రియలు
అమెరికాలో ఈతకు వెళ్లిన ఓ హైదరాబాదీ యువకుడు నీట మునిగి దుర్మరణం చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం ఈ ఘటన జరగ్గా ఆదివారం యువకుడి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు సుమారు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వారి ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు అక్షిత్‌రెడ్డిని (26) పైచదువుల కోసం 3 ఏళ్ల క్రితం అమెరికా పంపించారు. షికాగోలో ఎమ్మెస్ పూర్తి చేసిన అతడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
మరోవైపు, తల్లిదండ్రులు తమ కుమారుడి పెళ్లి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే, గత శనివారం అక్షిత్‌రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్ మిషిగన్‌లో ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండి పోగా మిగతా ఇద్దరూ నీటిలోకి దిగి చెరువు మధ్యలో ఉన్న రాయి వరకూ వెళ్లారు. చాలా శ్రమకోర్చి అక్కడి వరకూ వెళ్లగా తిరిగొచ్చే క్రమంలో అక్షిత్‌రెడ్డి అలసిపోయి నీట ముగిపోయాడు. అతడి స్నేహితుడూ నీట మునిగిపోగా స్థానికులు కాపాడారు. ఈ క్రమంలో పోలీసులు అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం అతడి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోగా ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు నిర్వహించారు.