అది కుక్క మాంసం కాదు... మేక మాంసం: కర్ణాటక హోంమంత్రి

  • బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం వడ్డిస్తున్నారంటూ నిన్న కలకలం
  • రాజస్థాన్ నుంచి కుక్క మాంసం తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు
  • బెంగళూరులో 90 పార్శిళ్ల స్వాధీనం
  • ఫుడ్ ల్యాబ్స్ లో శాంపిళ్లను పరిశీలించిన అధికారులు
  • మేక మాంసం అని తేలిందన్న హోంమంత్రి
బెంగళూరులోని కొన్ని హోటళ్లకు రాజస్థాన్ నుంచి కుక్క మాంసం సరఫరా అవుతోందంటూ కొన్ని సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దాంతో బెంగళూరు రైల్వే స్టేషన్ లో 90 పార్శిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని మాంసం శాంపిళ్లను ఫుడ్ ల్యాబ్ కు పంపారు. 

దీనిపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర స్పందించారు. రాజస్థాన్ నుంచి బెంగళూరుకు తరలించిన మాంసం కుక్క మాంసం కాదని స్పష్టం చేశారు. ఆ పార్శిళ్లలో ఉన్నది మేక మాంసం అని వెల్లడించారు. ఫుడ్ ల్యాబ్ లో శాంపిళ్లను పరిశీలించగా మేక మాంసం అని తేలిందని వివరించారు. 

బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం వడ్డిస్తున్నారంటూ కొందరు దురుద్దేశపూరితంగానే ఫిర్యాదులు చేసినట్టు భావిస్తున్నామని హోంమంత్రి పరమేశ్వర అన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.


More Telugu News