అమ్మ జపనీస్.. నాన్న ఇండియన్.. ఒక ‘లవ్ అండ్ లైఫ్’ కథ!
- ఒడిశాలోని పూరీ నగరంలో జరిగిన వాస్తవ గాధ
- ప్రపంచ పర్యటన చేస్తూ వచ్చిన జపాన్ యువతి
- పూరీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండిపోయిన తీరు
- ఇన్ స్టాగ్రామ్ లో వారి కుమారుడు పెట్టిన వీడియో వైరల్
అతనో ర్యాప్ సింగర్. పేరు సమీర్ రిషు మొహంతి. ఇటీవలే తన తల్లిదండ్రుల గురించి చెప్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టాడు. అది అలాంటి ఇలాంటి వీడియో కాదు. ఒక సినిమా కథ రేంజ్ లో అలరిస్తున్న గాధ. మరి ఆ కథేంటో తెలుసుకుందామా..
జపాన్ కు చెందిన ఓ కాలేజీ విద్యార్థిని. స్టడీ టూర్ లో భాగంగా పలు దేశాల్లో పర్యటిస్తూ.. ఒడిశాలోని పూరీకి వచ్చింది. తర్వాత మిగతా ప్రాంతాల్లో పర్యటించి.. తిరిగి జపాన్ కు వెళ్లిపోయింది. తన అనుభవాలతో ఓ పుస్తకం రాయడం మొదలుపెట్టింది. అయితే తాను కొన్ని రోజులే ఉన్నా.. పూరీ నగరాన్ని మాత్రం మర్చిపోలేకపోయింది. తట్టాబుట్టా సర్దుకుని పూరీకి వచ్చేసింది. ఇక్కడే ఉండిపోయి తన పుస్తకాన్ని పూర్తి చేద్దామనుకుంది.
అసలే విదేశీయురాలు.. ఎలా?
జపాన్ యువతి పూరీకి రానైతే వచ్చిందిగానీ.. ఇక్కడ బతకడానికి ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకే పూరీకి వచ్చే విదేశీయులకు అనుకూలంగా ఉండేలా చిన్న హోటల్ పెట్టాలనుకుంది. ఈ క్రమంలోనే పూరీ నగరంలోనే ఉండే మహంతి పరిచయం అయ్యాడు. ఆమె విదేశీయురాలు కావడంతో.. మహంతి పేరిట స్థలం కొని చిన్న హోటల్ కట్టారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకున్నారు. ఆ హోటల్ కు ‘లవ్ అండ్ లైఫ్’ అని పేరు పెట్టారు.
ఇప్పటికీ ఉన్న హోటల్..
ఇదంతా జరిగి 25 ఏళ్లకుపైనే అవుతోంది. నాడు ప్రేమికులు కలిసి పెట్టిన ‘లవ్ అండ్ లైఫ్’ హోటల్ ఇప్పటికీ నిలిచి ఉంది. ర్యాపర్ సమీర్ రిషు మహంతి తన తల్లిదండ్రులను, వారు పెట్టిన హోటల్ ను చూపిస్తూ.. ఈ కథను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు.
‘‘మమ్మీ, బపా.. మీ ప్రేమ కథను నేను ఇన్ స్టాలో పెట్టాను. అది ఎంతో మందికి చేరింది. ఇప్పుడు ప్రపంచానికి అందింది..” అని కామెంట్ పెట్టారు.
ఈ వీడియోకు వేల కొద్దీ లైకులు, లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ ప్రేమ కథ బాగుంటుందంటూ కామెంట్లు పడుతున్నాయి.