ధన్యవాదాలు పవన్ అన్న: మంత్రి నారా లోకేశ్
- ఏపీలో పలు పథకాలకు పేర్లు మార్పు
- చంద్రబాబుకు, లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
- వినమ్రంగా బదులిచ్చిన లోకేశ్
ఏపీలో పలు పథకాలకు కూటమి ప్రభుత్వం పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. జగనన్న అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం... జగనన్న విద్యాకానుక పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర... జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం... మన బడి నాడు-నేడు పథకానికి మన బడి- మన భవిష్యత్తు... స్వేచ్ఛ పథకానికి బాలికా రక్ష... జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అంటూ పేర్లు మార్చారు.
దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్ చేసిన ట్వీట్ పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి అభినందనలు నూతనోత్తేజం నింపాయి. పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయి. ధన్యవాదాలు పవన్ అన్న" అంటూ వినమ్రంగా బదులిచ్చారు.