నన్ను కూడా ఇందులో భాగం చేసినందుకు సంతోషంగా ఉంది: విజయ్ దేవరకొండ
- దర్శకుల సంఘం కార్యక్రమం దర్శక సంజీవని మహోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ
- తాను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు దర్శక సంఘానికి సహకారం అందిస్తానని వెల్లడి
హైదరాబాదులో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం (టీఎఫ్ డీఏ) ఆధ్వర్యంలో దర్శక సంజీవని మహోత్సవం పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు. సభ్యులకు హెల్త్ కార్డులు, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చిత్ర పరిశ్రమలో ఉన్నంత వరకు తెలుగు దర్శకుల సంఘానికి సహకారం అందిస్తూనే ఉంటానని తెలిపారు. సక్సెస్ లేని దర్శకులకు, యాక్టర్లకు నెలవారీ జీతాలు ఉండవని, ఆ లైఫ్ ఎలా ఉంటుందో తనకు తెలుసని విజయ్ దేవరకొండ అన్నారు. ఇవాళ ప్రవేశపెట్టిన హెల్త్ కార్డులు, మధ్యాహ్న భోజన సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
అసలు, ఇలాంటి అసోసియేషన్ ఉన్నట్టు తనకు తెలియదని... శివ నిర్వాణ, సాయి రాజేశ్, వీర శంకర్ లు తనను కలవడంతో ఈ విషయం తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారి కంటే వయసులో తాను చిన్నవాడినైనా, తనను కూడా ఇందులో భాగం చేయడం ఎంతో సంతోషం కలిగించిందని విజయ్ దేవరకొండ వివరించారు.