ఇది ఎన్డీయే ప్రభుత్వం... డీఎన్ఏ ప్రభుత్వం కాదు: విజయసాయిరెడ్డికి హోంమంత్రి అనిత కౌంటర్
- అనిత, విజయసాయి మధ్య మాటల యుద్ధం
- హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న విజయసాయి
- హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
- 'శాంతి'-భద్రతల విషయంలో ఎవరు రాజీనామా చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్న అనిత
ఏపీ హోంమంత్రి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడంలేదని విజయసాయి విమర్శించారు.
'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్ర భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అందుకు హోంమంత్రే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు.
దీనిపై హోంమంత్రి అనిత స్పందించారు. 'శాంతి'-భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో, నేను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయినా ఇది డీఎన్ఏ ప్రభుత్వం కాదు... ఇది ఎన్డీయే ప్రభుత్వం... ప్రజలు బాగానే ఉన్నారు... దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, ఎక్స్ లో రెట్టలు వేస్తున్నారు అని అనిత విమర్శించారు.