రేవంత్ రెడ్డి ఆఫర్‌ను తిరస్కరించిన అక్బరుద్దీన్ ఒవైసీ
- మజ్లిస్ పార్టీలోనే ఉంటానన్న అక్బరుద్దీన్ ఒవైసీ
- పార్టీలో సంతోషంగానే ఉన్నానని వ్యాఖ్య
- చివరి శ్వాస వరకు మజ్లిస్ పార్టీలోనే కొనసాగుతానన్న అక్బరుద్దీన్
తనను ఉపముఖ్యమంత్రిగా చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. తాను మజ్లిస్ పార్టీలోనే ఉంటానని, పార్టీలో సంతోషంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. చివరి శ్వాస వరకు మజ్లిస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.
అక్బరుద్దీన్ ఇంకా మాట్లాడుతూ... ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదేనని, కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నెరవేర్చాలన్నారు. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి తాను కృషి చేశానన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే హైదరాబాద్‌కు మెట్రో రైలు వచ్చిందన్నారు. పాతబస్తీకి మాత్రం ఇప్పటి వరకు మెట్రో రాలేదన్నారు.