ధవళేశ్వరం వద్ద గోదావరికి పెరుగుతున్న వరద... రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
- గోదావరి మరోసారి ఉగ్రరూపం
- ఇప్పటికీ ముంపులోనే కోనసీమ లంక గ్రామాలు
- ధవళేశ్వరం వద్ద 13.75 అడుగులకు నీటిమట్టం
- ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు
ఏపీలో గోదావరి నది పరీవాహక ప్రాంతాలను వరద ముంపు ఇంకా వీడలేదు. ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
కోనసీమ లంక గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉండగా... గోదావరి ఉద్ధృతి మళ్లీ పెరగడంతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. వరద నీటిలోకి దిగొద్దని స్పష్టం చేసింది.