బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నిక
- 2014-19 మధ్య కూడా తనకు పార్టీ అవకాశం ఇచ్చిందన్న విష్ణుకుమార్
- 2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగిందని విమర్శ
- బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని ఆరోపణ
బీజేపీ ఏపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమర్ రాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ... 2014-19 మధ్య కూడా తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని తెలిపారు.
2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగించిందని మండిపడ్డారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.