కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెప్పడం కాదు... ఆధారాలతో చూపించాలి: హరీశ్ రావు
- బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శ
- రూ.4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకువెళ్లామన్న హరీశ్ రావు
- రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2000కు పెంచామన్న మాజీ మంత్రి
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగా లేదని మాటలతో చెప్పడం కాదని... ఆధారాలతో చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు.
రూ.4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకువెళ్లింది తమ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ హయాంలోనే రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2000కు పెంచామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చెప్పిన రూ.4 వేల పెన్షన్ నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు.