సినిమాలు చేస్తూనే ఉంటాను.. మీ పని మీరు చేసుకోండి: ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌పై నటుడు విశాల్ ఆగ్రహం
- విశాల్‌కు సినిమాలు చేయవద్దని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం
- తనను ఆపే ప్రయత్నం చేస్తే కొంతమంది ఎప్పటికీ సినిమాలు తీయలేరన్న విశాల్
- తన హయాంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికి నిధులు వినియోగించామన్న హీరో
నేను సినిమాలు చేస్తూనే ఉంటాను... మీ పని మీరు చేసుకోండంటూ నటుడు విశాల్ తమిళ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు కౌంటర్ ఇచ్చారు. విశాల్‌కు సినిమాలు చేయవద్దంటూ ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను సినిమాలు చేయడం మానుకునేది లేదన్నారు.
ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకునే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేయలేరన్నారు. తన హయాంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికి నిధులు వినియోగించామన్నారు. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి ఆరోగ్య బీమా కల్పించామన్నారు. ఈ నిర్ణయాలు కూడా తోటి సభ్యులతో కలిసి తీసుకున్నవే అని వెల్లడించారు.
మీ పని మీరు సక్రమంగా చేయండి... పరిశ్రమ కోసం ఎంతో చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రెట్టింపు పన్ను, థియేటర్ నిర్వహణ ఖర్చుల సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. తాను సినిమాలు చేస్తూనే ఉంటానని... తనను ఆపే ప్రయత్నం చేసే ముందు ఓసారి ఆలోచించుకోండని హితవు పలికారు.