పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

  • పంచాయతీ ఎన్నికలకు త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు
  • ఆగస్ట్ మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితాను పూర్తి చేయాలన్న సీఎం
  • నిర్దిష్ట గడువులోగా రిజర్వేషన్ అంశంపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌కు ఆదేశాలు
పంచాయతీ ఎన్నికలకు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితాను పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, నిర్దిష్ట గడువులోగా రిజర్వేషన్ అంశంపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

శుక్రవారం ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్ట్ నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 6 నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కే కేశవరావు తదితరులు పాల్గొన్నారు.


More Telugu News