ఏజెంట్ చేతిలో చిక్కి సౌదీలో నరకం.. లోకేశ్ చొరవతో హైదరాబాద్ చేరుకున్న కోనసీమ వాసి
- ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వీరేంద్రకుమార్‌ను సౌదీలో పడేసిన ఏజెంట్
- అక్కడి దుర్భర జీవితాన్ని భరించలేక అనారోగ్యం
- ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోకు స్పందించిన మంత్రి లోకేశ్
- ఆయన ఆదేశాలతో వీరేంద్రకుమార్‌ను రక్షించిన టీడీపీ ఎన్నారై విభాగం
- హైదరాబాద్ నుంచి కోనసీమకు బయలుదేరిన వీరేంద్ర
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న కోనసీమ జిల్లా యువకుడిని మంత్రి నారా లోకేశ్ కాపాడారు. జిల్లాలోని ఇసుకపూడికి చెందిన వీరేంద్రకుమార్ ఏజెంట్‌ను నమ్మి మోసపోయాడు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల మధ్య పడేశారు. అక్కడ దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్యం పాలైన వీరేంద్ర కుమార్ ఇటీవల ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఏజెంట్ చేతిలో చిక్కి మోసపోయానని, తానీ దురవస్థ అనుభవించలేనని, తనను రక్షించాలని వేడుకున్నాడు.
ఆ వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేశ్.. వీరేంద్రకుమార్‌కు ధైర్యం చెప్పారు. స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని, ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. లోకేశ్ ఆదేశాలతో వీరేంద్రకుమార్‌ను స్వస్థలానికి తరలించే ఏర్పాట్లను టీడీపీ ఎన్ఐఆర్ విభాగం తీసుకుంది. ఈ క్రమంలో వీరేంద్ర కుమార్ ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. సోదరి లక్ష్మి, కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇసుకపూడికి బయలుదేరారు. తనను కాపాడిన మంత్రి లోకేశ్, టీడీపీ ఎన్నారై విభాగానికి వీరేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.