ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణ... తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్
- పార్టీ ఫిరాయింపు అంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- స్పీకర్ తన ఫిర్యాదును పట్టించుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్
ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నుంచి పిటిషన్ ను స్వీకరించాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది.
దానం నాగేందర్ ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని తాను చేసిన ఫిర్యాదును స్పీకర్ తీసుకోలేదంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫిర్యాదును స్పీకర్ స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మహేశ్వర్ రెడ్డి నుంచి ఫిర్యాదును స్వీకరించాలని, అలాగే ఫిర్యాదును అందుకున్నట్టు రసీదు కూడా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.