రేపు రాత్రి ఢిల్లీ పయనం కానున్న ఏపీ సీఎం చంద్రబాబు
- ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం
- రేపు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు
- పోలవరం అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్న ఏపీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జులై 26) రాత్రి ఢిల్లీ పయనం కానున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. ఎల్లుండి (జులై 27) ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై సీఎం చంద్రబాబు గళం వినిపించనున్నారు.
ముఖ్యంగా, పోలవరం అంశాన్ని కేంద్రం పెద్దల ఎదుట ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించిన అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం విజయవాడకు తిరిగి రానున్నారు.