సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
సీఎం చంద్రబాబు శాంతిభద్రతలపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలపై క్యాబినెట్ సమాలోచనలు జరిపింది. నివేదికలో నిపుణులు పేర్కొన్న అంశాలను ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రేపు విడుదల చేయనున్న ఆర్థిక శాఖ శ్వేతపత్రం అంశాలు కూడా నేటి క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.