గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో... కాంగ్రెస్ హామీల అమలూ అంతే నిజం: బండి సంజయ్

  • భట్టివిక్రమార్క చదివింది బడ్జెట్టా... అప్పుల పత్రమా? అని విమర్శ
  • ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో బడ్జెట్‌లో చెప్పలేదన్న కేంద్రమంత్రి
  • బడ్జెట్‌ను చూస్తుంటే హామీల అమలు ప్రభుత్వానికి చేతకాదని తెలుస్తోందని వ్యాఖ్య
గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో... కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే నిజమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్రమంత్రి స్పందించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి చదివింది బడ్జెట్టా? అప్పుల పత్రమా? అన్నది అర్థం కావడం లేదన్నారు.

ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో బడ్జెట్‌లో చూపలేదని విమర్శించారు. ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే హామీల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని తెలుస్తోందన్నారు. 

బడ్జెట్‌పై హరీశ్ రావు

గత ప్రభుత్వం కంటే తాము ఎక్కువ అప్పులు తెచ్చుకుంటామని బడ్జెట్‌లో చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలని... కానీ దురదృష్టవశాత్తు అలా లేదన్నారు. నెలకు రూ.2500 సాయం కోసం కోటి మంది మహిళలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా ఇంకా ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు.


More Telugu News