ఏపీ శాసనసభలో రేపు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల
- 2019-24 మధ్య రూ.1,41,588 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తింపు
- ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు తేల్చిన ప్రభుత్వం
- రూ.48 వేల కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదన్న ప్రభుత్వం
సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రేపు శుక్రవారం నాడు ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో రూ.93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. రూ.48 వేల కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని తెలిపింది.
నీటి పారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలను గుర్తించారు. ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్ల బిల్లుల పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది.