మాజీ భార్య నటాషా పోస్ట్.. రెడ్‌హార్ట్ ఎమోజీతో స్పందించిన హార్దిక్ పాండ్యా

మాజీ భార్య నటాషా పోస్ట్.. రెడ్‌హార్ట్ ఎమోజీతో స్పందించిన హార్దిక్ పాండ్యా
  • కుమారుడితో కలిసి సెర్బియాలోని పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన నటాషా
  • విడాకుల తర్వాత తొలిసారి నటాషా ఇన్‌స్టా పోస్ట్
  • పాండ్యా స్పందనకు తనకు ఏడుపొచ్చిందన్న యూజర్ 
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత నటాషా తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా స్పందించింది. దీనికి సెర్బియాలోని ఓ థీమ్‌పార్క్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోను జత చేసింది. దీనికామె సింపుల్‌గా రెడ్ హార్ట్ సింబల్‌ను క్యాప్షన్‌గా తగిలించింది. 

ఈ పోస్టు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడంతో అది కాస్తా పాండ్యా దృష్టిలో పడింది. దీనికి అతడు తొలుత  రెడ్ హార్ట్ ఎమోజీ, ఆ తర్వాత ఈవిల్ ఐ, హార్ట్ ఐ, ఓకే హ్యాండ్ ఎమోజీలతో సానుకూలంగా స్పందించాడు. నటాషాతో విడాకులు తీసుకుంటున్నట్టు పాండ్యా ప్రకటించిన తర్వాత అతడిపై వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, తాజాగా ఇలా సానుకూలంగా స్పందించడంతో యూజర్లు కూడా అతడికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. 

పాండ్యా కామెంట్ చూశాక తనకు నిజంగా ఏడుపొచ్చిందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. ఆమెపై ద్వేషాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని, పాండ్యా కూడా ఆమెపై ఎలాంటి ద్వేషమూ వ్యక్తపరచడం లేదని పేర్కొన్నాడు. అది వారి వ్యక్తగత జీవితమని, విడిపోవడమనేది వారి వ్యక్తిగత నిర్ణయమని రాసుకొచ్చాడు.

కాగా, వివాహమైన నాలుగేళ్ల తర్వాత పాండ్యా, నటాషా తాజాగా విడాకులు తీసుకున్నారు. వీరు విడిపోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. వీటిని నిజం చేస్తూ ఇటీవల ఇద్దరూ సంయుక్తంగా విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు తెలిపారు.


More Telugu News