వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌కు పిచ్‌ను మార్చారా?... భారత మాజీ బ్యాటింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పిచ్ ను మార్చలేదన్న మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్
- అంతకుముందు మ్యాచ్‌లు కూడా స్లో పిచ్‌పైనే ఆడామని ప్రస్తావన
- ఫైనల్ ఆడిన అహ్మదాబాద్ పిచ్ ఆట గడిచే కొద్దీ మార్పు చెందే పిచ్ అని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్ ను దాదాపు 17 ఏళ్ల తర్వాత గెలవడంతో భారత్ క్రికెటర్లు సంతోషంలో ఉన్నారు. ఆ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తూనే ఉన్నారు. అయితే టీ20 వరల్డ్ కప్‌కు కొన్ని నెలల ముందు ఆటగాళ్లు ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక ఆటగాళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆటగాళ్లను ఓదార్చిన విషయం తెలిసిందే.
కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఉద్దేశపూర్వకంగా పిచ్‌ను మార్చిందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. కావాలనే ‘స్లో పిచ్’ను రూపొందించారని భారత మాజీ స్టార్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్ సహాయక బృందంలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన విక్రమ్ రాథోడ్ తాజాగా స్పందించారు.
ఫైనల్ మ్యాచ్‌కు వేరే పిచ్‌ను వాడారంటూ వచ్చిన కథనాల గురించి తాను విన్నానని, అయితే ఈ కథనాలతో తాను ఏకీభవించనని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశారు. అంతక్రితం మ్యాచ్‌లలో కూడా ఇలాంటి పిచ్‌లపైనే భారత్ జట్టు ఆడిందని అన్నారు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఈ తరహా స్లో పిచ్‌లపై ఆడామని, అయితే అహ్మదాబాద్ పిచ్ మ్యాచ్ గడుస్తున్న కొద్దీ మారిపోయే స్వభావం కలిగిన పిచ్ అని వివరించారు. ఈ మేరకు 'స్పోర్ట్‌స్టార్'తో మాట్లాడుతూ అన్నారు.
కాగా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రోజు గడిచే కొద్దీ పిచ్ మెరుగుపడే అవకాశం ఉందని గ్రహించిన ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ మొదట బౌలింగ్ చేసే ఛాన్స్ దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా విక్రమ్ రాథోడ్ టీ20 ప్రపంచ కప్ 2014, వన్డే ప్రపంచ కప్ 2023 ఈ రెండు టోర్నీలలో భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.