శ్వేతపత్రంలో పేర్కొన్నది చాలా తక్కువ... మద్యం అంశంలో చాలా దోపిడీ జరిగింది: పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విడుదల చేసిన మద్యం పాలసీ శ్వేతపత్రంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం అంశంలో రూ.3 వేల కోట్ల దోపిడీ జరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారని, కానీ దీంట్లో చాలా లోతైన దోపిడీ జరిగిందని అన్నారు. దాదాపు రూ.18,866 కోట్ల మేర దోపిడీ జరిగినట్టు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ఇదంతా ప్రజాధనమేనని, ఇదంతా ఎక్కడికి వెళ్లింది? అని వ్యాఖ్యానించారు. 

కేంద్ర బడ్జెట్ లో మనకు రూ.15 వేల కోట్లు వస్తేనే సంతోషపడ్డాం... కానీ, దోపిడీ చేసిన సొమ్మంతా వస్తే రాజధానికి, పోలవరానికి కూడా ఇబ్బంది ఉండేది కాదు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రూ.18 వేల కోట్ల మేర ఖజానాకు లూటీ వేసిన మద్యం అక్రమార్కులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు.


More Telugu News