ఢిల్లీలో జగన్ తో పాటు ధర్నాలో కూర్చున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్

  • ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న వైసీపీ
  • నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిరసన కార్యక్రమం
  • వైసీపీకి సంఘీభావం తెలిపిన సంజయ్ రౌత్
ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపిస్తూ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు నేడు ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఈ ధర్నా కార్యక్రమానికి శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు పలికారు. సంజయ్ రౌత్ నేడు జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నాలో పాల్గొన్నారు. జగన్ తో పాటు కూర్చుని ఏపీలో జరిగిన పలు సంఘటనల తాలూకు ఫొటోలను ఆయన పరిశీలించారు. జగన్ ఆయనకు పలు సంఘటనలను వివరించారు.


More Telugu News