ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం: మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

  • తల్లికి వందనం పథకానికి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడి
  • ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే వారందరికీ వర్తిస్తుందని స్పష్టీకరణ
  • ఈ పథకంలో లోటుపాట్లు లేకుండా చూస్తున్నామని వెల్లడి
ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పైగా ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంపై మంత్రులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

గతంలో ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి... ఆ తర్వాత రూ.14 వేలు, అనంతరం రూ.13 వేలకు తగ్గిందన్నారు. అర్హత నిబంధనలు కూడా గత ప్రభుత్వం మార్చిందన్నారు. ఇలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు.


More Telugu News