ప్రపంచ శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 82వ స్థానంలో భారత్
- 195 దేశాల యాక్సెస్‌తో మొదటి స్థానంలో సింగపూర్
- రెండో స్థానంలో జపాన్, స్పెయిన్, జర్మనీ
- చివరి స్థానంలో ఆప్గనిస్థాన్
ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది. ఈ పాస్‌పోర్ట్‌తో భారతీయులకు 58 దేశాల్లో ఎంట్రీ ఉంది. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేశాయి. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు.
శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 195 దేశాలకు యాక్సెస్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఆప్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ (192) రెండో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191) మూడో స్థానంలో ఉన్నాయి.
న్యూజిలాండ్, బెల్జియం, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్ (190) నాలుగో స్థానంలో, ఆస్ట్రియా, పోర్చుగల్ (189) ఐదో స్థానంలో, గ్రీస్, పోలాండ్ (188) 6వ స్థానంలో, కెనడా, హంగేరీ, మాల్టా (187) ఏడో స్థానంలో, అమెరికా (186) ఎనిమిదో స్థానంలో, ఈస్టోనియా, లిథుయేనియా, యూఏఈ (185) తొమ్మిదో స్థానంలో, ఐస్‌లాండ్, లాట్వియా, స్లొవేకియా, స్లొవేనియా (184) పదో స్థానంలో నిలిచాయి.