బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారు: హరీశ్ రావు వెల్లడి
- ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తామన్న హరీశ్ రావు
- బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని ఛాంబర్ ఎదుట ధర్నా చేయాలని సూచన
- నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్న మాజీ మంత్రి
బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులపై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళతామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపినందుకు తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని ఛాంబర్ వద్ద నిరసన తెలపాలన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాట ఇచ్చిన కాంగ్రెస్... ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందన్నారు. సన్నబియ్యం టెండర్లలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. అయినప్పటికీ సన్నబియ్యం టెండర్లను ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని నిలదీశారు.