బడ్జెట్‌పై స్పందించిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి
- తెలంగాణకు నిధులివ్వలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని విమర్శ
- దేశం పట్ల, ప్రజల పట్ల బీజేపీకి కమిట్మెంట్ ఉందన్న బండి సంజయ్
- ఇప్పటికైనా బీఆర్ఎస్, కాంగ్రెస్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్య
- ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారన్న కిషన్ రెడ్డి
బడ్జెట్‌పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించారు. బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మూర్ఖంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించారన్నారు. మోదీ ఆధ్వర్యంలో గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు.
2047 నాటికి భారత్‌ను అంతర్జాతీయంగా నెంబర్ 1గా చూడాలనేది మోదీ కోరిక అన్నారు. ఆ విజనరీని సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. మౌలిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. దేశం పట్ల, ప్రజల పట్ల బీజేపీకి కమిట్మెంట్ ఉందన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పింది కాంగ్రెస్, వంతపాడింది కేసీఆర్... వీరే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాను విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. డీపీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా సమర్పించని బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
వరంగల్‌కు టెక్స్ టైల్ పార్కును ఎన్నడో ప్రకటించి... నిధులు కేటాయించాక మళ్లీ దాని గురించి మాట్లాడటం ఏమిటని నిలదీశారు. రైల్వే వోరాలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన విషయం మరిచి... కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, కాంగ్రెస్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు: కిషన్ రెడ్డి
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదాను ప్రకటించిందన్నారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు.