వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్ర బడ్జెట్ ఉంది: లంకా దినకర్
- నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మల రికార్డు సృష్టించారన్న లంకా దినకర్
- ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమని వెల్లడి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టి బడ్జెట్ పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ స్పందించారు. ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని కొనియాడారు.
మహిళా శక్తికి మోదీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని లంకా దినకర్ అభివర్ణించారు. ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి తదితర 9 అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. మధ్య తరగతి ప్రజలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు.
ఎన్నికల సమయంలో మోదీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారమే బడ్జెట్ లో పొందుపరిచారని లంకా దినకర్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు.