'ప్రతి పక్ష నేత హోదా'పై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్

  • అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ
  • విపక్ష హోదా కూడా దక్కని వైనం
  • ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోలేదన్న జగన్
  • ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా... కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు.

ఈ నేపథ్యంలో, జగన్ నేడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడంలేదని జగన్ ఆరోపించారు.


More Telugu News