నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో తెల్లవారుజామున పట్టాలు తప్పిన రైలు
- నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో ప్రమాదం
- క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిన రెండు వ్యాగన్లు
నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ రైలు నెల్లూరు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. బిట్రగుంట రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపు ఉన్న 144వ లెవల్ క్రాసింగ్ గేటు వద్ద గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్ ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అత్యవసర రైళ్లను మూడో లైన్‌లోకి పంపించాలని నిర్ణయించారు.