దేవాదాయ శాఖలో శాంతి నియామకంపై ఆరోపణలు ఉన్నాయి: మంత్రి ఆనం
- ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మీడియాలో విస్తృతంగా కథనాలు
- ఈ వ్యవహారంలో కేంద్ర బిందువుగా శాంతి
- శాంతి నియామకంలో తప్పు జరిగితే పీఎస్సార్ ఆంజనేయులు కూడా బాధ్యులేనన్న మంత్రి ఆనం
- అప్పుడు పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో ఉన్నారని వెల్లడి
ఇటీవల మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో కథనాలు ప్రసారం కాగా, ఈ వ్యవహారంలో కేంద్ర బిందువుగా ఉన్న శాంతి అంశంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు.
దేవాదాయ శాఖలో శాంతి ఉద్యోగ నియామకంపై ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. అప్పుడు పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీలో ఉన్నారని తెలిపారు. శాంతి నియామకంలో తప్పు జరిగితే పీఎస్సార్ ఆంజనేయులు కూడా బాధ్యులేనని ఆనం స్పష్టం చేశారు. దీనిపై ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కోరతామని చెప్పారు.
విశాఖలో పనిచేసినప్పుడు శాంతిపై పలు ఫిర్యాదులు వచ్చాయని, ముఖ్యంగా ప్రేమ సమాజం భూముల విషయంలో శాంతిపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. విశాఖ భూ అక్రమాల్లో శాంతితో పాటు సుభాష్ పైనా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అసెంబ్లీ ముందు ఉంచుతామని చెప్పారు.
ఇవాళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ, శాసనసభ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు.