దానం, కడియం అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్
  • వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి
  • మంగళవారం మరోసారి వాదనలు వినిపిస్తామన్న అడ్వొకేట్ జనరల్
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. 

వారిపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టుకు వెళ్లారు. ఈ రోజు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. మంగళవారం మరోసారి వాదనలు వినిపిస్తామని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు.


More Telugu News