కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత
  • డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • విచారణను వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్ట్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత తీహార్ జైల్లో ఉన్నారు. సీబీఐ కేసులో ఆమె డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జి‌షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోపక్క, అనారోగ్య కారణాలతో ఉన్న కవితకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మెడికల్ రిపోర్టులను జైలు అధికారులు కోర్టుకు సమర్పిస్తారు.


More Telugu News