రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం...: కేంద్రమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి

  • రాయితీని ఓఎంసీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి
  • రేవంత్ రెడ్డి వెంట భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • అంతకుముందు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన సీఎం
కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తోన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ఓఎంసీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ప్రియాంకగాంధీని కలిసిన రేవంత్, భట్టివిక్రమార్క

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు కలిశారు. అంతకుముందు వీరు సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా రుణమాఫీకి సంబంధించిన వివరాలను చర్చించారు.


More Telugu News