వైఎస్ వివేకా హత్య కేసు.. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
- శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత పిటిషన్
- ఈ కేసులో తాము ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదన్న సీబీఐ
- రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈనాటి వాదనల సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ఈ కేసులో తాము ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ రెండో వారంలో తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ల ధర్మాసనం ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే వారంలో లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.