పదేళ్లుగా రోడ్డు మీద జీవిస్తున్న మహిళకు అపార్ట్‌మెంట్ ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్.. భావోద్వేగ వీడియో ఇదిగో
- సొంతంగా అపార్ట్‌మెంట్ ఇవ్వడంతో భావోద్వేగానికి గురైన మహిళ
- ఇసాహియా గార్జా అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
- వైరల్‌గా మారిన వీడియో
నా అనేవారు ఎవరూ లేకుండా.. ఒంటరిగా రోడ్డు మీద జీవనం వెళ్లదీస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి ఉచితంగా ఆమెకు ఒక ఫ్లాట్ ఇస్తే ఎలా ఉంటుంది?.. అదే చేసి చూపించాడు ఒక అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఏకంగా పదేళ్లుగా రోడ్డుపై జీవనం సాగిస్తున్న ఒక అమెరికన్ మహిళను ఇసాహియా గార్జా అనే ఇన్‌ప్లుయెన్సర్ జీవితంలో ఎప్పుడూ ఊహించని ఆశ్చర్యానికి, భావోద్వేగానికి గురిచేశాడు.
నిరాశ్రయురాలైన ఆమె వద్దకు కారులో వెళ్లిన అతడు దగ్గరకు పిలిచాడు. ఒక పార్సిల్ అందించి దానిని ఓపెన్ చేయమని అడిగాడు. దానిని ఓపెన్ చేసిన ఆమె అందులో ఒక తాళాన్ని(కీ) గుర్తించింది. ‘‘నేను నీకు అపార్ట్‌మెంట్ ఇచ్చాను’’ అని ఇసాహియా గార్జా అన్నాడు. దాంతో ఒక్కసారిగా ఆ మహిళ భావోద్వేగానికి గురయ్యింది. ‘ఆర్ యూ క్రేజీ?’ అంటూ కన్నీళ్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను గార్జా షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
ఇన్‌ఫ్లుయెన్సర్ ఇసాహియా గార్జా.. ఆ మహిళను పలకరించడం, ఆమె ఉల్లాసంగా స్పందించడం వీడియోలో కనిపించింది. కాగా టీవీ, బెడ్, దాదాపు అన్ని వసతులు ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కు ఆమెను తీసుకెళ్తున్నట్టు వీడియో క్లిప్‌లో కనిపించింది. 10 ఏళ్లుగా నిరాశ్రయురాలుగా ఉంటున్న మహిళను ఆశ్చర్యపరిచానని గార్జా పేర్కొన్నాడు. ఆమెకు చేసిన సాయం ద్వారా చాలా నేర్చుకున్నానని, ఆమె అద్భుతమైన మనిషి అని, ఈ అందమైన క్షణాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 200 మిలియన్లకుపైగా వ్యూస్ రావడం గౌరవసూచకంగా భావిస్తున్నానని అన్నాడు. 15 ఏళ్లపాటు ఒక వ్యక్తి వీధుల్లో నివసిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదని, ఎలాంటి బాధలు అనుభవిస్తారో అవగాహన లేదని గార్జా పేర్కొన్నాడు. అయితే ఆమె జీవితంలో కొద్దిగానైనా మార్పు తీసుకురాగలిగానని పేర్కొన్నాడు.
కాగా జూన్ 7న ఈ వీడియోను షేర్ చేయగా 11.1 మిలియన్లకు పైగా వ్యూస్, తొమ్మిది లక్షల లైక్‌లను సంపాదించుకుంది. ఆమె లేచి నిలబడి ఆనందంతో అరుస్తున్న తీరు తనకు చాలా బాగా నచ్చిందని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. ‘నువ్వు నన్ను ఏడిపించావ్ బ్రదర్’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘‘దానం చేసి పేదవాడిగా మారిన మనిషి ఈ ప్రపంచంలోనే లేడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బ్రదర్’’ అని ఓ వ్యక్తి కొనియాడాడు.