భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం... మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, పర్యాటకులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.