కోనసీమ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

  • వాయుగుండం ప్రభావంతో కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు
  • ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి
  • పరిస్థితిని సమీక్షించి సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్
గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. గోదావరి నది ఉద్ధృతి దృష్ట్యా జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఈ మేరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. 

అటు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్ లో విద్యాసంస్థలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గోదావరి నదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద పోటెత్తుతోంది. భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో, దిగువకు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

గత కొన్నిరోజులుగా వరుస అల్పపీడనాలు, వాయుగుండం ఏర్పడడంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. దాంతో, నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి.


More Telugu News