అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలవాలని కిమ్ జాంగ్ ఉన్ కోరుకుంటున్నాడు: డొనాల్డ్ ట్రంప్

  • మరోసారి తనను అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నాడేమో అన్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి
  • నన్ను అతడు మిస్ అవుతుండడమే కారణం అనుకుంటున్నానని వ్యాఖ్య
  • ఇటీవల జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కోరుకుంటున్నారని అన్నారు. ‘‘ నన్ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని అతడు (కిమ్) కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే.. అతడు నన్ను మిస్ అవుతుండడమేనని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు. ఇటీవల మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టకుండా ఆపివేసినట్లు ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అయితే ఆ దేశం మళ్లీ క్షిపణి ప్రయోగాలు చేస్తోందని పేర్కొన్నారు. కాగా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కిమ్ జాంగ్ ఉన్‌ను ‘లిటిల్ రాకెట్ మ్యాన్’గా ట్రంప్ సంభోదిస్తుండేవారు. ఇరువురూ పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకున్నప్పటికీ చివరికి ఘర్షణలు పక్కనపెట్టి దౌత్య మార్గాన్ని అనుసరించారు. ఇద్దరూ పరస్పర చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


More Telugu News