మంచు విష్ణుకు గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ ప్రభుత్వం
- యూఏఈలో దీర్ఘకాలిక నివాసం ఉండేందుకు సహకరించే వీసా
- ఇప్పటికే అనేక మంది భారతీయ సెలబ్రిటీలకు గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ
- తనకు కూడా గోల్డెన్ వీసా ఇవ్వడం పట్ల మంచు విష్ణు హర్షం
భారత్ లో ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులకు గోల్డెన్ వీసా ఇచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం తాజాగా టాలీవుడ్ కథానాయకుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు కూడా గోల్డెన్ వీసా అందించింది.
కళలు, సాంస్కృతిక రంగంలో మంచు విష్ణు కృషికి గుర్తింపుగా గోల్డెన్ వీసాతో గౌరవించినట్టు యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మంచు విష్ణు స్పందించారు. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు.
టాలీవుడ్ నుంచి ఇప్పటికే ఈ గోల్డెన్ వీసాను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా అందుకున్నారు. వైద్య సేవలు, సామాజిక రంగంలో చేసిన కృషికి గాను ఉపాసన కొణిదెలకు కూడా గోల్డెన్ వీసా ప్రదానం చేశారు.
సాధారణంగా గోల్డెన్ వీసాను యూఏఈ గడ్డపై కనీసం రూ.20.50 కోట్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినవారికి, శాస్త్రసాంకేతిక రంగ నిపుణులకు, ఇండస్ట్రియలిస్టులకు, క్రీడాకారులు, ప్రత్యేక ప్రతిభావంతులకు, కళాకారులకు ఇస్తారు.
గోల్డెన్ వీసా ఉంటే యూఏఈలో ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండానే నివాసం ఉండొచ్చు. వంద శాతం యాజమాన్య హక్కులతో ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితులు లేకుండా, స్థానిక పౌరుల మాదిరే స్వేచ్ఛగా ఉండొచ్చు. ఈ వీసా కాలపరిమితి ఐదేళ్లకోసారి, పదేళ్లకోసారి ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంది.
బాలీవుడ్ లోనూ చాలామందికి ఈ గోల్డెన్ వీసా లభించింది. షారుఖ్ ఖాన్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, బోనీ కపూర్, మౌనీ రాయ్, ఫరా ఖాన్, సోనూ నిగమ్ తదితరులకు యూఏఈ గోల్డెన్ వీసా అందించింది. దక్షిణాదిన మమ్ముట్టి, మోహన్ లాల్, త్రిష, అమలాపాల్, దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ కూడా గోల్డెన్ వీసా అందుకున్నారు.