పాండ్యా కెప్టెన్సీ ఆశలు ఆవిరి చేయడంలో అజిత్ అగార్కర్ పాత్ర!
- శ్రీలంక పర్యటనకు జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ
- కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా శుభమన్ గిల్
- పాండ్యా ఫిట్‌నెస్ నిలకడలేమిపై కోచ్ గంభీర్ అసంతృప్తి
- కెప్టెన్సీ సమర్థత అతడికి లేదని అభిప్రాయపడిన అజిత్ అగార్కర్
టీమిండియా సారథి రోహిత్‌శర్మ టీ20ల నుంచి తప్పుకోవడంతో ఆ పగ్గాలు ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యాకు అప్పజెబుతారని, జట్టులో అంతకుమించిన సమర్థుడు లేడని అభిమానులు అనుకున్నారు. అయితే, వారి అంచనాలను కోచ్ గౌతం గంభీర్ తలకిందులు చేశాడు. శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, శుభమన్‌గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.
ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో తరచూ విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా విషయంలో గంభీర్ కన్విన్స్ కాలేకపోయాడని నివేదికలు చెబుతున్నాయి. అందుకనే అతడిని పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్‌ను కోరుకున్నట్టు తెలిసింది. అంతేకాదు, ఈ విషయంలో అజిత్ అగార్కర్ పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం.
కోచ్‌గా గంభీర్ రాకతో పాండ్యా కెప్టెన్సీ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రోహిత్ తర్వాత జట్టులో కెప్టెన్సీ చేపట్టే సామర్థ్యం అతడికే ఉందని అభిమానులు భావించారు. అయితే, అతడికి సారథిగా ఉండేందుకు అవసరమైన సమర్థత ఉందని అజిత్ అగార్క్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విశ్వసించలేకపోయిందని తెలిసింది.