రీల్స్ కోసం డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనేందుకు బంగారు నగలు చోరీ చేసిన పనిమనిషి
- ఢిల్లీలోని ద్వారకలో ఘటన
- ఈ నెల 15న ఓ ఇంట్లో పని మనిషిగా చేరిన మహిళ
- రెండు బంగారు గాజులు, వెండి గొలుసు, కాళ్ల పట్టాలు చోరీ
- ఢిల్లీ విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోవాలని భావించిన ఓ పనిమనిషి డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనేందుకు పనిచేస్తున్న ఇంట్లోనే లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు దొంగిలించింది. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. ఢిల్లీలోని రాజ్‌పురాలో జరిగిందీ ఘటన.
ద్వారకలోని ఓ ఇంట్లో ఈ నెల 15న పనిమనిషిగా చేరిన నీతూ (30) యజమానుల నమ్మకాన్ని చూరగొంది. పనిలో చేరేటప్పుడు తన వివరాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మారిపోవాలని భావించిన నీతూ అదును చూసి రెండు బంగారు గాజులు, వెండిగొలుసు, కాళ్ల పట్టాలు దొంగిలించి పరారైంది.
ఆపై తన సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేసుకుంది. లొకేషన్ గుర్తించకుండా పలు ఆటోలు మారింది. ఇంట్లో నగలు పోయిన విషయాన్ని గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజ్‌పురి చౌక్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లేందుకు బ్యాగేజీతో సిద్ధమైన ఆమె నుంచి దొంగిలించిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.