భార్యకు సింగపూర్ వర్సిటీ పట్టా... పవన్ కల్యాణ్ ఆనందం... ఫొటో ఇదిగో!
- సింగపూర్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న అన్నా లెజినోవా
- సింగపూర్ లో స్నాతకోత్సవానికి హాజరైన పవన్ కల్యాణ్
- భార్య రెండో మాస్టర్స్ డిగ్రీ సాధించినందుకు అభినందనలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం సబ్జెక్టులో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అన్నా లెజినోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ.
సింగపూర్ వర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి భార్య అన్నాతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు పవన్ ఆనందం వెలిబుచ్చారు. రెండో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న భార్యకు అభినందనలు తెలిపారు.
అన్నా లెజినోవా గతంలో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ లో ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై పీటర్స్ బర్గ్ వర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్నారు. థాయ్ లాండ్ చరిత్ర సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేశారు. రష్యా యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఆమె మూడు భాషలు నేర్చుకున్నారు.
ఇక, థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని దులాలాంగ్ కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్ సబ్టెక్టుతో తొలి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.