ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనమేం చేయాలనేదే ముఖ్యం: టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు
- జులై 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించారు.
కేంద్రంతో సమన్వయం కోసం ఇప్పటికే ఒక్కో ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించామని, ఆ దిశగా ఎంపీలు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలు రాష్ట్రమంత్రులను వెంటబెట్టుకుని వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని చంద్రబాబు సూచించారు. విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన అంశాలపైనా నేటి సమావేశంలో చర్చించారు.
కాగా, ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు... మనం ఏం చేయాలనేదే ముఖ్యం అని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.