ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
- 25న ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ
- వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచన
- వంద శాతం వ్యయం లక్ష్యాన్ని సాధించేలా బడ్జెట్ రూపకల్పన చేయాలన్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
బడ్జెట్‌ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకు కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా రూపకల్పన చేయాలని సూచించింది.
గత పదేళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5 శాతం వ్యయమైనట్లు శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయ, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతోంది.