ఈ నెల 22న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా... ఈ నెల 27న తొలి మ్యాచ్
- శ్రీలంకలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న టీమిండియా
- జులై 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్
- టీ20ల్లో ఆడే టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
- వన్డేల్లో రోహిత్ సారథ్యం
- శ్రీలంక పర్యటన ద్వారా టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్న గంభీర్
టీ20, వన్డే సిరీస్ లు ఆడేందుకు టీమిండియా ఈ నెల 22న శ్రీలంక పయనం కానుంది. టీ20 సిరీస్ లో సూర్యకుమార్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వన్డేల్లో ఎప్పట్లాగానే రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన అనంతరం టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
కాగా, శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ 27 నుంచి జరనుగంది. ఆగస్టు 2 నుంచి వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనుంది. కాగా, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే బాధ్యతలు అందుకోనున్నాడు. జులై 22న దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.