తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

  • పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం
  • ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర, తీరంలోని వాయవ్య బంగాళాఖాతంలో చిలికా సరస్సు వద్ద వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.


More Telugu News