పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్‌ను కలిసిన కేటీఆర్, హరీశ్ రావు
- విద్యార్థులపై అప్రజాస్వామికంగా దాడులు చేసి, కేసులు పెట్టారని ఆగ్రహం
- ఉద్యమం సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని విమర్శ
- జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీత
పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ బృందం తెలంగాణ గవర్నర్‌ను కలిసి, వినతి పత్రం ఇచ్చింది. గవర్నర్‌ను కలిసిన వారిలో కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అప్రజాస్వామికంగా దాడులు చేశారని, కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో... ఇప్పుడూ అలాగే ఉన్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు. గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు.